వీడియో: చెప్పును ఎత్తుకుపోయిన పాము

వీడియో: చెప్పును ఎత్తుకుపోయిన పాము

ఓ పాము చెప్పును నోటితో పట్టుకుని తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. పాము చెప్పును ఎత్తుకెళ్లడం ఏంటి అనుకుంటున్నారా.. మామూలుగా చెప్పులను పాము కరిచినప్పుడు దాని మూతి ఆ చెప్పుకే అతుక్కుపోతుంది. అలాంటిది ఓ పాము రాళ్ల మధ్యలో నుంచి వచ్చి ఓ ఇంటి బయట ఉన్న చెప్పును నోటితో కరుచుకుని అక్కడే తిరుగుతుంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. 

ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ వైల్డ్ లైఫ్ గురించి తరచూ ఆసక్తికర వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ పాము వీడియోను కూడా ఆయన తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ పాము ఆ చెప్పును తీసుకుపోయి ఏం చేస్తుందో తనకు ఆశ్చర్యంగా ఉందంటూ పర్వీన్ కాశ్వాన్ క్యాప్షన్ పెట్టారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియదని పేర్కొన్నారు. అయితే, వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొంత మంది మహిళల మాటలు వినిపించాయి.