రోహింగ్యాలపై 65 కేసులు నమోదు

రోహింగ్యాలపై 65 కేసులు నమోదు

హైదరాబాద్: రోహింగ్యాలపై ఇప్పటి వరకు 65 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రోహింగ్యాలపై రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్న నేపధ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించారు. రోహింగ్యాలు మొత్తం 4835 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 4561 మందికి ఇప్పటికే బయోమెట్రిక్, ఐరీష్ లు కంప్లీట్ చేశామన్నారు. రోహింగ్యాల పై ఇప్పటి వరకు 65 కేసులు నమోదయ్యాయని వివరించారు. 24 బోగస్ ఆధార్ కార్డులు, 15 ఓటర్ కార్డులు, 4 డ్రైవింగ్ లైసెన్స్, 9 పాస్ పోర్ట్ , 2 పాన్ కార్డులు కలిగి ఉన్న వారి పై కేసులు నమోదు చేశామని.. 2018 నుండి ఇప్పటి వరకు 165 మందిని అరెస్టు చేశామని తెలిపారు. నకిలీ ఆధార్ కార్డు కేసులో ఇద్దరికి రెండేళ్ల  జైలు శిక్ష పడిందని మహేష్ భగవత్ తెలిపారు.

Read More News….

డీజీపీ కుర్చీపై ‘పింక్’ టవల్.. రేగుతున్న వివాదం

వీడియో: నా మీదే పోటీచేస్తావా.. డివిజన్‌లో నీకు జాగా లేకుండా చేస్తా..

ఆ రైలు పరుగుల వెనుక ‘‘పింక్ గ్యాంగ్’’

వెరైటీ వెడ్డింగ్ కార్డు: మట్టిలో పెడితే పూలు, కూరగాయల మొక్కలు మొలకెత్తుతాయి