శానిటైజర్ లేకుంటే సబ్బు జేబులో పెట్టుకోండి: రాచకొండ పోలీస్

శానిటైజర్ లేకుంటే సబ్బు జేబులో పెట్టుకోండి: రాచకొండ పోలీస్

కరోనాపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ రాచకొండ పోలీసులు రెండు రోజుల క్రితం వాహనదారులకు వ్యక్తిగత శుభ్రత గురించి సూచనలిచ్చారు.  సిగ్నల్ పడ్డప్పుడు రోడ్డుపై నిల్చుని వాహనదారులందరికీ చేతులు ఎలా  కడుక్కోవాలనే విషయాన్ని ప్రదర్శించి చూపారు.  వైరస్ పై అవగాహన కల్పిస్తూ చేతులను సబ్బుతో గానీ, శానిటైజర్ తో గానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెప్పారు.

శనివారం రోజు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఓ వీడియో షేర్ చేస్తూ.. సబ్బు వైరస్ ని ఏ విధంగా చంపుతుందనే విషయాన్ని అందులో పేర్కొన్నారు.  ‘‘శానిటైజర్ లేకుంటే సబ్బు జేబులో పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనివార్యం. ఇతరులు ముట్టుకొన్న ఏ వస్తువును తాకినా 20 సెకన్ల పాటు చేతులను వెనుక ముందు కడుక్కోవటం మరువొద్దు’’ అని ట్విట్టర్‌లో తెలిపారు రాచకొండ పోలీసులు.

కరోనా పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు