టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్ మెంట్ ఆగస్టు 8న గ్రాండ్ గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నటి శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి పనులు షురూ అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. లేటెస్ట్ గా శోభితా పసుపు దంచుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్ ఇచ్చింది.
ALSO READ | కర్వా చౌత్ ఉపవాసం ప్రత్యేకత: రానా భార్య మిహికా, రకుల్ ప్రీతీ సింగ్ స్పెషల్ పోస్ట్ వైరల్
ఈ ఫొటోస్ లో శోభిత చాలా సంప్రదాయంగా కనిపిస్తూ అక్కినేని ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఎరుపు రంగు, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ నెటిజన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో అతి త్వరలోనే చై-శోభితా ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఈ అక్కినేని వారి పెళ్లి వైజాగ్ లోనే జరగనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం శోభిత సినిమాల విషయానికొస్తే..బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. శోభితా లీడ్ రోల్‌లో తెరకెక్కిన లేటెస్ట్ వెబ్ ‘లవ్ సితార’ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వందనా కటారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు.ఇకపోతే చై తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.