కర్వా చౌత్ ఉపవాసం ప్రత్యేకత: రానా భార్య మిహికా, రకుల్ ప్రీతీ సింగ్ స్పెషల్ పోస్ట్ వైరల్

కర్వా చౌత్ ఉపవాసం ప్రత్యేకత: రానా భార్య మిహికా, రకుల్ ప్రీతీ సింగ్ స్పెషల్ పోస్ట్ వైరల్

దగ్గుబాటి రానా 2020లో నార్త్ అమ్మాయి మిహికా బజాజ్(Miheeka Bajaj)ను లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మిహిక ఇంటీరియర్‌‌ డిజైనింగ్‌లో చాలా టాలెంటెడ్. మిహికా డ్యూ డ్రాప్‌ పేరుతో ఒక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెకార్‌‌ కంపెనీనీ నిర్వహిస్తున్నారు. లండన్‌లోని చెల్సీ యూనివర్సీటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌లో ఏంఏ చేశారు.  

ఇదిలా ఉంటే.. నార్త్లో భార్యాభర్తలు చేసుకునే ఫేమస్ పండుగ కర్వాచౌత్ (Karwa Chauth2024). లేటెస్ట్గా మిహిక బజాజ్ తన ఇన్ స్టాగ్రామ్లో కర్వా చౌత్ పండుగను సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేస్తూ ఇంట్రెస్ట్ ట్యాగ్ ఇచ్చింది.

Also Read :- నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్

"అదే చంద్రుడు కింద ప్రతి సంవత్సరం ప్రేమ ఇంకా బలపడుతుంది" అంటూ తన భర్త రానా దగ్గుబాటిని ట్యాగ్ చేసి హ్యాపీ కర్వాచౌత్ అని చెప్పింది. ఈ ఫొటోస్లో మిహికా సాంప్రదాయంగా చీర కట్టుకొని రానాకీ విష్ చేయడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Miheeka Daggubati (@miheeka)

అలాగే హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ కూడా తన భర్త జాకీ భగ్నానీతో మొదటిసారిగా కర్వాచౌత్ ఫెస్టివల్ జరుపుకుంది. "నా సూర్యుడు, చంద్రుడు, విశ్వం, నా ప్రతిదీ నువ్వే.. కర్వాచౌత్ శుభాకాంక్షలు" అంటూ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ కాలు ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కర్వా చౌత్ ఉపవాసం ప్రత్యేకత:

కర్వా చౌత్ పండుగ రోజున రోజున, వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, కర్వా చౌత్ పండుగను కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. చంద్రుడు ఈ రోజున మెయిన్ రోల్ పోషిస్తాడు, ఎందుకంటే చంద్రుడు ఉదయించిన తర్వాత మాత్రమే మహిళలు తమ ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దాంపత్య జీవితం కూడా సుఖమయం అవుతుందని చాలా మంది నమ్ముతారు. కాగా కర్వా చౌత్ రోజున వివాహిత స్త్రీలకు ఎరుపు రంగు శుభప్రదంగా పరిగణించబడుతుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)