బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) వాడి వేడిగా జరుగుతోంది. బిగ్బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం గమనిస్తూ వస్తున్నాం. ఈసారి లిమిటే లేకుండా.. ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగ్ ఆడియన్స్కు హామీ ఇచ్చేసిన.. ట్విస్టులు కూడా అదే లెవల్లో ఇస్తూ వస్తున్నాడు.
ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో భాగంగా ఏడో వారం నాగ మణికంఠ (Naga Manikanta) ఎలిమినేట్ అయి హౌస్ నుంచి వెళ్లిపోయాడు. ఏడు వారాలు ఉన్న మణికంఠ ఆట ఎలా ఆడాడు. అతని ఎలిమినేషన్ ఎలా జరిగింది. ఇక ఈ ఏడు వారాలకుగాను ఎంత సంపాదించాడు? అనే వివరాల్లోకి వెళితే..
ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో వరుసగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఢీ డ్యాన్సర్ నైనిక, కిర్రాక్ సీత, ఆదిత్య ఓం ఎలిమినేట్ అయి బిగ్ బాస్ ఇంటిని వదిలిపెట్టి వెళ్లారు. లేటెస్ట్ 7వ వారంలో నాగ మణికంఠ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. అయితే, మణికంఠ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాకుండా తనకు తాను ఆరోగ్యం బాగోలేదంటూ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.
Also Read :- 'బఘీర’ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్
ఈ క్రమంలో హౌజ్‌లో ఏడు వారాలు ఉన్న మణికంఠ వారానికి రూ. 1,20,000 (లక్షా 20 వేల రూపాయలు) రెమ్యునరేషన్ తీసుకునేవాడని సమాచారం. అంటే, రోజుకు 17 వేల 142 రూపాయలు అన్నమాట! దీన్నిబట్టి చూస్తే.. ఏడు వారాల పాటు నాగ మణికంఠ సుమారుగా రూ. 8,40,000 రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. అయితే, బిగ్బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్లలో మణికంఠ తక్కువ రెమ్యునేషన్ అందుకుంటున్నాడు.
💥 Manikanta's journey in the Bigg Boss house may have come to an end, but his gameplay and strategy were truly commendable! From bold moves to unforgettable moments, he gave his all and left a lasting impression on both the housemates and viewers alike. #BiggBossTelugu8 #StarMaa pic.twitter.com/L7GdDnM644
— Starmaa (@StarMaa) October 20, 2024
అంతేకాదండోయ్.. బిగ్ బాస్ టైటిల్ గెలిచే తన భార్య, బిడ్డల దగ్గరకు వెళతానని ముందునుంచే శపథాలు చేస్తూ వచ్చాడు మణికంఠ. కానీ లాస్ట్ వీక్ నుండి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏమైందో ఏమో ఇక బిగ్ బాస్ హౌస్ లో ఏ మాత్రం ఉండలేను.. వెంటనే ఇంటికి వెళ్లిపోతానంటూ తెగ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆరోగ్యం బాగోలేదు.. తన మైండ్ పని చేయట్లేదు.. బాడీ సహకరించట్లేదు.. బయటకు పంపించండి అంటూ బిగ్ బాస్ ను వేడుకున్నాడు.
ఇక బిగ్ బాస్ యాజమాన్యం నాగ మణికంఠ పరిస్థితిని అర్థం చేసుకుని డాక్టర్ దగ్గరకు కూడా పంపించగా వాళ్లు బాగానే ఉందని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. అయినా సరే హౌస్‌లో సర్దుకోలేకపోయినా మణికంఠ.. చివరగా నాగ్ అవకాశం ఇస్తూ.. 'మీ భార్య ప్రియకు ఏ మాట ఇచ్చావో, కూతురికి ఏం చెప్పావో గుర్తు తెచ్చుకోవాలని' మణితో నాగార్జున అన్నారు. అయినా తాను వెళ్లిపోతాననేలా మణి చెప్పారు. అతడు కోరుకున్నట్లుగానే నాగార్జున బయటకు పంపించేశారు.
ఇకపోతే మణికంఠ ఎప్పుడూ సింపతీతో గేమ్ అడుతుంటాడాని అలాగే ఓవర్ ఎమోషన్స్ చూపిస్తూ చిరాకు తెప్పిస్తుంటాడని అందుకే ఈ వారం మణికంఠ ఎలిమినేట్ కాబోతున్నట్లు పలువురు వారం రోజుల నుంచి నెటిజన్లు కామెంట్లు చేస్తూ వచ్చారు.