PrashanthNeel: 'బఘీర’ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..

PrashanthNeel: 'బఘీర’ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..

‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌‌కు పాన్ ఇండియా రేంజ్‌‌లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వీళ్లు ఏ ప్రాజెక్టు చేసినా వాటిపై అంచనాలు పెరుగుతున్నాయి.

ప్రశాంత్ నీల్ కథతో.. హోంబలే ఫిల్మ్స్‌‌ బ్యానర్‌‌‌‌పై ‘భగీర’(Bagheera) సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ‘ఉగ్రమ్’ ఫేమ్ శ్రీమురళి హీరోగా నటిస్తున్నాడు. సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

భగీర ట్రైలర్  చూస్తే.. రెండు డిఫరెంట్ గెటప్స్‌‌లో శ్రీమురళి కనిపించి ఆకట్టుకున్నాడు.ప్రశాంత్ నీల్ స్టైల్‌‌లోనే యాక్షన్‌‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌లోనే ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి.

'దేవుడు ఎందుకమ్మా రామాయణం, భారతం అంటూ ఎప్పుడో వస్తాడు.. ఎందుకు ఎప్పుడూ రాడు.. అని ఓ పిల్లాడు తన తల్లిని అడుగుతున్న డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ లో.. మనిషి మృగంగా మారినప్పుడు వస్తాడు అంటూ అందుకు దారి తీసే పరిస్థితిలను ఆమె వివరిస్తుంటే.. అందుకు తగ్గ క్రూరమైన విలన్స్ తో కూడిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

పోలీస్ ఆఫీసర్ అయిన హీరో.. తన యూనిఫామ్ను పక్కన పెట్టి.. ఆ ప్రాంతంలోని క్రిమినల్స్ని.. ఓ ముసుగు వేసుకుని చంపుతుంటాడు. అత్యంత పాశవికంగా అతను చేసే హత్యలు చూసి డిపార్ట్ మెంట్ హైయర్అథారిటీస్ (ప్రకాష్ రాజ్) మిగతా టీమ్ ను తిట్టి.. అతన్ని పట్టుకోమని చెప్పినా.. అతను చంపేది క్రిమినల్స్ నే కాబట్టి చంపడం ఎందుకు అంటూ వాళ్లే అనుకోవడం కనిపిస్తుంది.

ఓ వైపు పోలీస్ గా మరోవైపు రాక్షసులను చంపే వెపన్ గా మారె శ్రీ మురళి యాక్టింగ్ బాగుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మునుపటి సినిమాల మాదిరిగానే సాగిన కథనం భగీర పై అంచనాలు పెంచేసింది.

అయితే ట్రైలర్ని బట్టి స్టోరీ చెప్పాలంటే.. "చిన్నప్పుడు తల్లి చనిపోయిన ఓ పిల్లాడు.. పెరిగి పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీర' గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే" స్టోరీలా అనిపిస్తుంది. 

ALSO READ : ఓజీ నుంచి బిగ్ అప్డేట్.. ప్రియాంక ఫ్యాన్స్ పండగ చేస్కోండి..!

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టైటిల్, ఫ‌స్ట్ లుక్‌, టీజర్ రిలీజ్ చేయ‌గా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇక లేటెస్ట్ ట్రైలర్తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాను దీపావళి సందర్బంగా 2024 అక్టోబ‌ర్ 31న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు.