బమ్​ రుక్నుద్దౌలా చెరువు పరిరక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం

బమ్​ రుక్నుద్దౌలా చెరువు పరిరక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం
  • బమ్​ రుక్నుద్దౌలా చెరువు పరిరక్షణకు..సుప్రీంకోర్టుకు వెళ్తాం
  • సోషల్ ​యాక్టివిస్టు లుబ్నా సర్వత్ 

ఖైరతాబాద్​,వెలుగు :  శివరాంపల్లిలోని నేషనల్​ పోలీసు అకాడమీకి ఎదురుగా ఉన్న బమ్​ రుక్నుద్దౌలా చెరువు పరిరక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తామని సెంటర్ ​ఫర్ వెల్ ​బీయింగ్​ ఎకనామిక్స్​ హైదరాబాద్ ​వ్యవస్థాపక డైరెక్టర్, సోషల్ ​యాక్టివిస్టు లుబ్నా సర్వత్  స్పష్టంచేశారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 4 00 ఏండ్ల చరిత్ర కలిగిన రుక్నుద్దౌలా చెరువుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. ఆనాడు రాజులకు, సాధారణ ప్రజలకు మంచినీటి అవసరాలు తీర్చిన చెరువు, ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

2017లో చెరువు విస్తీర్ణం 17 ఎకరాలు ఉందని చెప్పిన ప్రభుత్వ సంస్థలు,  అనంతరం10 ఎకరాలుగా చూపించాయని తెలిపారు.  పొంతన లేని సర్వే రిపోర్టులతో పరోక్షంగా అప్పటి అధికారులు చెరువు కబ్జాకు సహకరించారని ఆరోపించారు. చెరువు కబ్జా అవడంతో  నేషనల్ ​గ్రీన్ ​ట్రిబ్యునల్​(ఎన్​జీటీ)ని కూడా ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. గురువారం కేసు హియరింగ్​ ఉండగా ఎలాంటి విచారణ చేయకుండా జులైకి వాయిదా వేశారని చెప్పారు. ఈ  సమావేశంలో ఏపీ మైనారిటీ కమిషన్​ మాజీ సభ్యుడు సయ్యద్​ తారక్​ ఖాద్రి, ఫారుక్ ​హుస్సేన్ ​తదితరులు పాల్గొన్నారు.