మీరు ఎవరిని అయితే ఎగతాళి చేశారో.. వాళ్లతోనే రియాల్టీ షోలు చేయండి

మీరు ఎవరిని అయితే ఎగతాళి చేశారో.. వాళ్లతోనే రియాల్టీ షోలు చేయండి

 కమెడియన్ సమయ్ రైనా సహా మరో ముగ్గురు కమెడియన్లకు  వైకల్యాన్ని జయించి, స్ఫూర్తినిచ్చే విజయాలు సాధించిన దివ్యంగులతో షోలు నిర్వహించాలి సుప్రీంకోర్టు  ఆదేశించింది. ఈ షోల ద్వారా వచ్చిన డబ్బును దివ్యంగుల చికిత్సకు, సహాయం చేయడానికి ఉపయోగించాలని చెప్పింది. 

సుప్రీంకోర్టు   ప్రధాన న్యాయమూర్తి  మాట్లాడుతూ ఇది శిక్ష కాదని, సామాజిక బాధ్యత మాత్రమే అని.. మీరు సమాజంలో మంచి స్థాయిలో ఉంటూ, పేరు సంపాదించుకున్నారు, ఆ పేరును ఇతరులతో సహాయం కోసం ఉపయోగించుకోండి అని అన్నారు. తరువాత విచారణ జరిగేలోపు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని కోర్టు ఆశిస్తున్నట్లు కూడా చెప్పింది.

అయితే దివ్యంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్లపై చర్య తీసుకోవాలని కోరుతూ క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ అనే సంస్థ కోర్టులో  ఫిర్యాదు వేసింది. ఈ వివాదం కొన్ని నెలల క్రితం సమయ్ రైనా అతని యూట్యూబ్ షో 'ఇండియాస్ గాట్ లాటెంట్' ఎపిసోడ్ నుండి మొదలైంది.

ఆ ఎపిసోడ్‌లో వైకల్యాలు, అరుదైన రోగాలు ఉన్న వ్యక్తులను ఎగతాళి చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయని.. ఈ విషయం ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు  ఎంతవరకు ఉంటుంది, కామెడీకి పరిమితులు ఏంటి అనే దానిపై పెద్ద చర్చకు దారితీసింది.

బలహీన వర్గాలను ఎగతాళి చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక ఎన్జీఓ ఫిర్యాదు చేసిన తర్వాత మొదట ముంబై పోలీసులు, ఆ తరువాత సుప్రీంకోర్టు సమయ్ రైనా సహా ఇతర కమెడియన్లను విచారణకు పిలిచింది. ఈ వివాదం కారణంగా సమాజంలో సున్నితమైన అంశాల పట్ల కమెడియన్లు బాధ్యత లేకుండా హద్దులు దాటిపోతున్నారనే ఆరోపణలు వచ్చాయి. చివరికి సమయ్ రైనా యూట్యూబ్ షోను తొలగించారు.