అద్దె చెల్లించలేదని సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు తాళం

అద్దె చెల్లించలేదని సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు తాళం

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ కి తాళం వేసిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. తాళం వేయడంతో గురుకులంలో పనిచేస్తున్న టీచర్స్ బయటే ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది. ములుగు జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతోంది. కొద్ది నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ఇల్లు యజమాని సాంబయ్య తన ఇంటికి తాళం వేశాడు. 

2018 డిసెంబర్ 27వ తేదీన రూ. 76 వేల చొప్పున రెంట్ అగ్రిమెంట్ చేసుకున్నామని ఇంటి యజమాని సాంబయ్య తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం అద్దె చెల్లించని కారణంగా హాస్టల్ గేటుకి తాళం వేశానని అన్నారు. జిల్లా కలెక్టర్ 2022 నుండి రెంట్ పెంచి ఇస్తానని చెప్పి, ఇవ్వడం లేదని చెప్పారు. బ్యాంకు లోన్ తీసుకుని భవనం కట్టానని, కిరాయి సమయానికి రాకపోవడంతో ఇన్ స్టాల్మెంట్ కట్టలేక ఇబ్బంది కావడం వల్ల గేటుకి తాళం వేశానని వెల్లడించాడు. పెంచిన రెంట్ ను ఇస్తేనే బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తానని స్పష్టం చేశాడు సాంబయ్య. ప్రభుత్వ నిర్లక్ష్యం వళ్ళే ఈ పరిస్తితి అంటూ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.