ఓటుకు రాకు.. కరోనాతో ఖతమైపోకు

ఓటుకు రాకు.. కరోనాతో ఖతమైపోకు

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కరీంనగర్ కు చెందిన సోషల్ వర్కర్ కోట శ్యాం కుమార్ విన్నూత నిరసన తెలిపారు. పరిస్థితులు బాగా లేవని.. ఓటింగ్ లో పాల్గొనకండి కరోనాకు బలికాకండంటూ వరంగల్  MGMH దగ్గర డాక్టర్ వేషంలో ప్లకార్డుతో నిరసన చేశారు. ‘ఓటుకు రాకు - కరోనాతో ఖతమై పోకు. నోటు మాటున ఓటు వేయకు..కరోనా కాటుకు బలి అవ్వకు. ఓటుకు నోటు ఉచితం..ఓటు వేయడానికి వస్తే కరోనా ఉచితం. ఓటు వేయడానికి దూరంగా ఉండండి.. కరోనా రోగాన్ని దరిచేరనివ్వకండి ‘ అంటూ నినాదాలు చేశారు.

ప్రజలు ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న.. ఈ సమయంలో  ఎలక్షన్స్ నిర్వహించడం, రాజకీయ పార్టీలు దానికి వత్తాసు పలకడం నిజంగా సిగ్గుమాలిన పనన్నారు. రాజకీయ నాయకులకు ఓట్లు మాత్రమే కావాలని.. ప్రజల ప్రాణాలు ఏమైపోయినా వాళ్లకు అవసరం లేదన్నారు. భార్య పిల్లలను ,తల్లిదండ్రులను వదిలేసి తమ ప్రాణాలు కూడా లెక్కచేయకుండా కరోనాతో పోరాడుతుంటే.. మీ స్వార్థం కోసం ఎలక్షన్స్ పెట్టి ఎంతమందిని కరోనాకు బలితీసుకుంటారని ప్రశ్నించారు.