మాదాపూర్లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

మాదాపూర్లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

మాదాపూర్లో ఓ ఐటీ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో 800మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డునపడ్డారు. ఇన్నోహబ్ టెక్నాలజీస్ పేరుతో నిరుద్యోగులైన ఒక్కొక్కరి దగ్గరి నుండి 2లక్షలు వసూలు చేసింది. మొత్తం 20కోట్ల వరకు వసూలు చేసి ఉద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి జీతాలు ఇచ్చిన కంపెనీ ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. రెండు వారాల క్రితం కంపెనీ వెబ్ సైట్స్, మెయిల్స్ బ్లాక్ అవడంతో ఆందోళన చెందిన ఉద్యోగులు మాదాపూర్ లోని ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడ ఏమి లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. బ్యాక్ డోర్ జాబ్స్ అంటూ ఎవరు చెప్పిన నమ్మి డబ్బులు కట్టవద్దని ఆయన సూచించారు. ఇన్నోహబ్ సంస్థపై మే 28న హన్మకొండకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడన్న సీఐ..ఇప్పటివరకు 60మంది కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో కమలేష్ కుమారి, రాహుల్ అలోక్, వైష్ణవి, ముద్ర, ప్రదీప్ లను నిందితులుగా గుర్తించామని.. వాళ్ళంతా హెచ్ఆర్, మేనేజ్మెంట్ లకు సంబంధించిన వాళ్ళని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

ఆ దాడి వ్యక్తిగతం కాదు..ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత

సివిల్స్ లో మెరిసిన తెలుగుతేజాలు