మద్యం మత్తులో యాక్సిడెంట్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

  మద్యం మత్తులో యాక్సిడెంట్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

రాయదుర్గం పీఎస్ పరిధి దర్గా చౌరస్తాలో మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. రాయదుర్గం నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న  ఓ కారు అతివేగంగా వచ్చి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కాంతారావు, సత్యనారాయణ అనే ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారిద్దరు  కోమాలో ఉన్నారు. యాక్సిడెంట్ చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులు. ప్రమాదం సమయంలో కారులో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు.