అమెరికాలో కాల్పులు.. నల్గొండ టెకీ మృతి

 అమెరికాలో కాల్పులు.. నల్గొండ టెకీ మృతి

నల్గొండ జిల్లా : అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో ఓ దుండగుడి కాల్పుల్లో నల్గొండకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నక్క సాయి చరణ్ (26) మృతి చెందాడు. సాయి చరణ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తన స్నేహితుడిని ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసి వస్తుండగా..  ఓ నల్లజాతి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయి చరణ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నల్గొండలో నివాసం ఉంటున్న సాయి చరణ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఒక్కగానొక్క కొడుకు నల్లజాతీయుడి కాల్పుల్లో చనిపోయాడు

అమెరికాలోని ఎమ్మెస్ పూర్తిచేసిన సాయి చరణ్ ఆరు నెలల క్రితమే సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. సెప్టెంబర్ లో ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో నల్లజాతీయుల చేతిలో చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. అగ్రరాజ్యంలో నల్లజాతీయుల కాల్పులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాయిచరణ్ తండ్రి నరసింహ. అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలో దురదృష్టకరం అని పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో ఇటువంటి ఘటనలు జరిగితే విద్య ఉద్యోగం కోసం అమెరికాకు తమ పిల్లలని ఎలా పంపుతారు అని నరసింహ ప్రశ్నించారు. ఇకముందైనా నల్లజాతీయుల చేతిలో విద్యార్థులు గాని, ఉద్యోగులు గాని చనిపోకుండా కాపాడాలని సాయి చరణ్ తండ్రి నరసింహ విజ్ఞప్తి చేశారు.