రంజీ మ్యాచ్‌లకు గ్రహణం ఎఫెక్ట్​!

రంజీ మ్యాచ్‌లకు గ్రహణం ఎఫెక్ట్​!

ముంబై: సూర్య గ్రహణం కారణంగా.. ముంబై, రాజ్‌‌కోట్‌‌లో జరుగుతున్న రంజీ మ్యాచ్‌‌లను గురువారం  రెండు గంటలు ఆలస్యంగా మొదలుపెట్టనున్నారు. గ్రహణం వల్ల కొన్ని ప్రాంతాల్లో దట్టంగా లేదా పాక్షికంగా చీకటి ఏర్పడే చాన్స్‌‌ ఉండటంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్‌‌ ప్రకారం రంజీ మ్యాచ్‌‌ ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ వాంఖడేలో ముంబై, రైల్వేస్‌‌, రాజ్‌‌కోట్‌‌లో సౌరాష్ట్ర, యూపీ మధ్య జరిగే మ్యాచ్‌‌లు ఉదయం 11.30 గంటలకు మొదలుకానున్నాయి. రైల్వేస్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌‌లో 41సార్లు రంజీ చాంపియన్‌‌ ముంబై  తొలి రోజు ఫస్ట్​ ఇన్నింగ్స్‌‌లో114 రన్స్‌‌కే కుప్పకూలింది. సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (39) టాప్‌‌ స్కోరర్‌‌. రైల్వేస్‌‌ బౌలర్‌‌ ప్రదీప్‌‌ 6, అమిత్‌‌ మిశ్రా 3 వికెట్లు తీశారు. తర్వాత రైల్వేస్‌‌ ఆట ముగిసే సమయానికి ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 116/5 స్కోరు చేసింది. ఆరిందమ్‌‌ ఘోష్‌‌ (52 బ్యాటింగ్‌‌), కర్న్‌‌ శర్మ (24 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. మరోవైపు టెస్ట్‌‌ స్పెషలిస్ట్‌‌లు చతేశ్వర్‌‌ పుజారా (57), షెల్డన్‌‌ జాక్సన్‌‌ (57), హర్విక్‌‌ దేశాయ్‌‌ (54) హాఫ్‌‌ సెంచరీలు సాధించడంతో తొలి రోజు సౌరాష్ట్ర ఫస్ట్​ఇన్నింగ్స్‌‌లో 322/8 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది.