జయశంకర్ భూపాలపల్లి/ మధిర, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కాటారంలో 700 ఇండ్లకు 2 కిలోవాట్ల చొప్పున మొత్తం 1,400 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టును 180 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు 334 ఇళ్ల సర్వే పూర్తై, 99 ఇళ్లకు మెటీరియల్ అందించినట్లు వెల్లడించారు. సమీక్షలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడులో సోలార్ పంప్‌సెట్, రావినూతలలో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ పనితీరును డిస్కం, రెడ్‌కో వైస్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖి, ఖమ్మం కలెక్టర్ దివాకర, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.సోలార్ ప్లాంట్ల ద్వారా ఉచిత విద్యుత్‌తో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.
