పంచాయతీ సెక్రటరీల సమస్యలు పరిష్కరించాలె

పంచాయతీ సెక్రటరీల సమస్యలు పరిష్కరించాలె
  • 317 జీవో ప్రకారం బదిలీ అయినవారిని సొంత జిల్లాలకు  ట్రాన్స్ ఫర్  చేయాలి
  • పంచాయతీ సెక్రటరీల సంఘం డిమాండ్

హైదరాబాద్, వెలుగు:  జీవో 317  ప్రకారం బదిలీ అయినవారిని సొంత జిల్లాలకు  ట్రాన్స్ ఫర్​ చేయాలని పంచాయతీ సెక్రటరీల సంఘం నేతలు డిమాండ్​ చేశారు.  గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా గ్రేడ్ 1,  2 పోస్టులు 40 శాతం ఉండాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేశ్,  విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం నాంపల్లి టీఎన్జీవో భవన్ లో  కార్యవర్గ సమావేశం జరిగింది.  

ఈ  సమావేశంలో సెక్రటరీల సమస్యలపై పలు తీర్మానాలు చేసి హిమాయత్ నగర్ లోని పంచాయతీరాజ్  డైరెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఉపాధి స్కీమ్ పర్యవేక్షణ చేస్తున్నందున స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో  గ్రేడ్ 1,2,3 సెక్రటరీలకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం దృష్టికి సెక్రటరీల సమస్యలు తీసుకెళ్తామని అధికారులు హామీలు ఇచ్చినట్లు పీఎస్  నేతలు తెలిపారు.