మెడికల్ ఆఫీసర్లు కనిపించడం లేదు!

మెడికల్ ఆఫీసర్లు కనిపించడం లేదు!

జీహెచ్ ఎంసీలో లో ఫీల్డ్ విజిట్ మానేశారు బల్దియాలోని కొందరు మెడికల్ అధికారులు. కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో అందుబాటులో ఉండి, సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ఆఫీసర్లు... ప్రజలకు దొరకడం లేదు. కొందరు కరోనా సోకి విధులకు హాజరు కావడం లేదు. మరికొందరు కోవిడ్ వస్తుందన్న భయంతో ఇళ్ల నుంచి బయటకు రావట్లేదు.  దీంతో క్లీన్ సిటీ కాస్తా.. డర్టీ సిటీగా మారుతోంది. 

సిటీలో పేరుకుపోతున్న చెత్త 

జీహెచ్ఎంసీలో 30 సర్కిల్స్ ఉన్నాయి. అందులో 20 సర్కిళ్లలో మెడికల్ ఆఫీసర్లు, 10 సర్కిళ్లలో డిప్యూటీ ఇంజినీర్లు శానిటేషన్ బాధ్యతలు చూస్తున్నారు. సిటీ పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సింది వీళ్లే. ఫీవర్ సర్వే, వాక్సినేషన్, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ సరిగా జారీ అవుతున్నాయా లేదా చూడడానికి ప్రతి రోజూ ఫీల్డ్ సర్వే చేయాలని మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఉన్నాయి. అయితే ఈ ఆదేశాలను చాలా మంది పట్టించుకోవట్లేదు. దీంతో సిటీలో చెత్త పేరుకుపోతోంది. ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్ కూడా అనుకున్న స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 

ఎన్నిసార్లు కాల్ చేసినా నో రెస్పాన్స్ 

రెండు రోజుల క్రితం మల్కాజ్ గిరి లో హెల్త్ విభాగంలో పని చేస్తున్న డైరెక్టర్ స్థాయి అధికారికి  కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తన ఇంటి ముందు ఉన్న చెత్త కుప్పలు తొలగించాలని స్థానిక మెడికల్ ఆఫీసర్ నిర్మలకు 10 సార్లు కాల్ చేసినా ఆమె స్పందించలేదు. ఉన్నతాధికారులు చాలా సార్లు కాల్ చేసినా ఆమె రెస్పాండ్ కాలేదు.  మలక్ పేట్, మల్కాజ్ గిరి, గోశామహల్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, కార్వాన్, ఓల్డ్ సిటీ లో పని చేస్తున్న మెడికల్ ఆఫీసర్ల పని తీరు కూడా ఇలానే ఉందనే ఆరోపణలున్నాయి. మెడికల్ ఆఫీసర్లపై బల్దియా ఉన్నతాధికారులకు 14 ఫిర్యాదులు అందాయి. డాక్టర్లుగా ఉన్న వారు ప్రజలకు అందుబాటులో ఉండకపోతే ఎలా అని సిటీ జనం ప్రశ్నిస్తున్నారు. ఫీల్డ్ విజిట్ కు వెళ్లని మెడికల్ ఆఫీసర్లపై నివేదికలు తెప్పించుకుంటున్నామంటున్నారు బల్దియా ఉన్నతాధికారులు.  తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. 


మరిన్ని వార్తల కోసం
రాజ్ భవన్-ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిందా..?

పైపు పగిలి రోడ్డు పాలవుతున్న మంచి నీళ్లు