క‌రోనాతో వ్య‌క్తి మృతి..డ‌బ్బు చెల్లిస్తేనే డెడ్ బాడీ

క‌రోనాతో వ్య‌క్తి మృతి..డ‌బ్బు చెల్లిస్తేనే డెడ్ బాడీ

హైద‌రాబాద్ : క‌రోనా పేరుతో ప‌లు ప్రైవేట్ హాస్పిట‌ల్స్ దోపిడీలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. క‌రోనా ట్రీట్ మెంట్ కు ల‌క్ష‌లు లాగుతున్నారు. అయినా ప్రాణాలు ద‌క్క‌డంలేదు. చివ‌ర‌కు డెడ్ బాడీ తీసుకుందామ‌న్నా.. అడ్డ‌గోలుగా బిల్లులు వేస్తూ మిగ‌తా అమౌంట్ పే చేస్తేనే డెడ్ బాడీ ఇస్తామంటున్నారు. ఆదివారం ఖ‌మ్మం జిల్లా, భక్తరామదాసు ప్రాంతానికి చెందిన అలీమ్ ఖురైషీ హైదరబాద్ లోని ర‌క్ష‌ (ప్రైవేట్ హాస్పిట‌ల్) లో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూ.6,50,000 బిల్లు వేసింది హాస్పిట‌ల్  యాజమాన్యం. రూ. 2 లక్షలు చెల్లించారు. మిగత నగదు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని హెచ్చరించారు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నామంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు మృతుడి కుటుంబ స‌భ్యులు.