డిగ్రీలు, పీజీలు చదివినా..అడుక్కుంటున్రు

డిగ్రీలు, పీజీలు చదివినా..అడుక్కుంటున్రు

జైపూర్: పీజీలు, డిగ్రీలు చేసిన కొంతమంది పని దొరక్క బెగ్గర్స్ గా మారారు. పొట్టకూటి కోసం అడుక్కుంటున్నారు. బెగ్గర్స్ కు ఏదైనా పని కల్పించి, జైపూర్ ను బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చాలనే ఉద్దేశంతో అక్కడి పోలీసులు ఓ ప్రాజెక్టు చేపట్టారు. ఇందుకోసం బెగ్గర్స్ పై మేలో సర్వే నిర్వహించగా, కొన్నిఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జైపూర్ లో మొ త్తం 1,162 మంది బెగ్గర్స్ ఉండగా..వారిలో 825 మంది అసలేం చదువుకోలే. 39 మంది లిటరేట్ పీపుల్. మరో193 మంది స్కూల్ కు వెళ్లారు. బెగ్గర్స్ లో ఐదుగురు మాత్రం బాగా చదువుకున్నారు. వీరిలో ఇద్దరు పీజీ చేయగా, ముగ్గురు డిగ్రీ పూర్తిచేశారు.

వీరందరూ తాము ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఎలాంటి పని దొరక్కపోవడంతోనే అడుక్కుంటున్నామని 419మంది చెప్పారు. తాము చదువుకుంటామని మరో 27మంది తెలిపారు. మొత్తం బెగ్గర్స్ లో 809 మంది రాజస్థాన్, 95 మంది ఉత్తర ప్రదేశ్, 45 మంది బీహార్, 37 మంది పశ్చిమ బెంగా ల్, 25 మంది గుజరాత్, 15 మంది మహారాష్ట్రకు చెందిన వారున్నారు. బెగ్గర్స్ లో 939 మంది మగవాళ్లు, 223 మంది ఆడవాళ్లు ఉన్నారని సర్వేలో తేలింది. బెగ్గర్స్ లో 898 మంది ఫిట్ గా ఉండగా.. 150 మంది దివ్యాంగులు, 18 మంది అస్తమా, ఆరుగురు క్షయ, ఒక్కరు కేన్సర్ బాధితులు ఉన్నారు.
ఏ పనిచ్చినా చేస్త..
‘‘నేను 25 ఏండ్లక్రితం గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చేశాను. జాబ్ కోసం జైపూర్ వచ్చాను. కానీ ఏ పనీ దొరకలేదు. కొన్నిరోజులు తినడానికితిండి కూడా లేదు. నాకు ఫ్యామిలీ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బెగ్గర్ గా మారాల్సి వచ్చింది” అని ఒక బెగ్గర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఇప్పుడు అవకాశం ఇస్తే, ఎలాంటి జాబ్ అయినా చేస్తానన్నాడు. తానిప్పుడు డిగ్నిటీగా బతకాలని అనుకుంటున్నానని చెప్పాడు. బెగ్గర్స్ కు పునరావాసం కల్పించేందుకు, అలాగే బెగ్గింగ్ లో ఏదైనా ఆర్గ‌నైజ్ డ్ గ్యాంగ్ ఇన్వాల్వ్ మెంట్ ఉందా? అని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించామని ఏసీసీ నరేంద్రదాహిమా తెలిపారు.