ఆక్సిడెంట్ చేసిన కొడుకు.. బైక్ ఇచ్చినందుకు తండ్రి అరెస్ట్

ఆక్సిడెంట్ చేసిన కొడుకు.. బైక్ ఇచ్చినందుకు తండ్రి అరెస్ట్

లైసెన్స్ లేని కొడుకుకు బండి ఇచ్చినందుకు తండ్రి అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోము పోచయ్య అనే వ్యక్తి మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలో కుటుంబంతో నివసిస్తున్నాడు. వీరి కుమారుడు సోము జగదీష్ (19) గత ఆదివారం తండ్రి బైక్ తీసుకొని బయటకు వెళ్లాడు. అయితే జగదీష్ బండిని నిర్లక్ష్యంతో వేగంగా నడుపుతూ.. రఘునాథ్ (50) అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రఘునాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందాడు. దాంతో దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జగదీష్‌కు ఆల్కహాల్ టెస్ట్ చేయగా మందు తాగలేదని తేలింది. దాంతో కేవలం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఆ ఘటనకు సంబంధించి ఆక్సిడెంట్ చేసినందుకు జగదీష్‌ను మరియు లైసెన్స్ లేని కొడుకుకు బండి ఇచ్చినందుకు తండ్రి పోచయ్యను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.