కరోనా భయంతో తల్లిని కూడా ఇంట్లోకి రానివ్వలె!

కరోనా భయంతో తల్లిని కూడా ఇంట్లోకి రానివ్వలె!

కొడుకును హెచ్చరించిన ఆఫీసర్లు

హోంక్వారంటైన్​కు చర్యలు

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: కరోనా భయంతో కన్నతల్లినే కొడుకు ఇంట్లోకి రానివ్వలేదు. ఈ ఘటన కరీంనగర్ లో చోటుచేసుకొంది. నగరంలోని 3వ డివిజన్ కిసాన్ నగర్ లో కొడుకు వద్ద నివసించే కట్ట శ్యామల(65) మూడు నెలల క్రితం తన చెల్లెలు దగ్గరికి షోలాపూర్ వెళ్లింది. లాక్ డౌన్ తో అక్కడే చిక్కుకుపోయింది. శుక్రవారం నగరంలోని ఇంటికి రాగా కొడుకు అడ్డుకున్నాడు. షోలాపూర్ లో కరోనా ఎక్కువగా ఉందని, తన కుమార్తె డెలివరీకి ఉందని లోపలికి రానీయలేదు. ఉదయం నుంచి ఎండలోనే ఆమె ఇంటి ముందే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని కొడుకును హెచ్చరించారు. శ్యామలను హోంక్వారంటైన్ లో ఉంచారు.

For More News..

సింగరేణిలో మెడికల్​బోర్డు ఎప్పుడు?

నిధులు కేసీఆర్ కుటుంబానికి.. నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయ్

తల్లిదండ్రులు భార్యను వేధిస్తున్నారని.. ఆమెతో కలిసి సూసైడ్ చేసుకున్న భర్త

కరోనా గురించి మామను కోల్పోయిన అల్లుడి సోషల్ మీడియా పోస్ట్