V6 News

తాగడానికి పైసలియ్యలేదని..  తల్లిని హత్య చేసిన కొడుకు

 తాగడానికి పైసలియ్యలేదని..  తల్లిని హత్య చేసిన కొడుకు

తాండూరు, వెలుగు: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ కొడుకు తల్లిని కొట్టి చంపి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఎల్మకన్నె గ్రామానికి చెందిన రుకాయ బేగం (49)ను ఆమె పెద్ద కొడుకు షేక్ మహబూబ్ ఆదివారం రాత్రి మద్యం కోసం డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో కోపంతో ఊగిపోయి ఇంట్లోని కట్టెతో తల, గొంతుపై బలంగా కొట్టాడు.

దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం మెడకు చీర చుట్టి దూలానికి ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. మృతురాలి కూతురు మునీర బేగంకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అసలు విషయం బయటపడింది. నిందితుడు నేరం అంగీకరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.