ఆస్పత్రి నుంచి వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్ డిశ్చార్జ్.. వైద్యులకు, మద్దతుదారులకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్

ఆస్పత్రి నుంచి వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్ డిశ్చార్జ్.. వైద్యులకు, మద్దతుదారులకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్

న్యూఢిల్లీ: క్లైమేట్ యాక్టివిస్ట్, ఎడ్యుకేషన్ రిఫార్మర్ సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్ గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మేదాంత ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే లడఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పర్వత ప్రాంతాలకు వెళ్తానని ప్రకటించారు. మార్పు తెచ్చింది రాళ్లు కాదు.. శాంతి మార్గమని తెలిపారు. గాంధేయ మార్గంలో శాంతియుత నిరసనల ద్వారానే విజయం సాధించినట్లు వెల్లడించారు. అందుకు కృతజ్ణతలు తెలిపేందుకు ఆస్పత్రి నుంచి ముందుగా రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘాట్‎కు వెళ్లి మహాత్ముడికి నివాళులు అర్పించానని చెప్పారు. 

తనపై జాతిపిత మహాత్మా గాంధీ ప్రభావం ఎంతో ఉందని, ఆయన సిద్దాంతాల ప్రభావంపై తనకెంతో విశ్వాసమని పేర్కొన్నారు. ఆరేళ్లుగా లడఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన అనుచరులు గాంధేయ వాదాన్ని పాటిస్తున్నారని సోనమ్ వివరించారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన మేదాంత ఆసుపత్రి డాక్టర్ల బృందానికి, సిబ్బందికి సోనమ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ఎక్స్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు.