‘రావణాసుర’ నుంచి సాంగ్ రిలీజ్

‘రావణాసుర’ నుంచి సాంగ్ రిలీజ్

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రావణాసుర’. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్. సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇప్పటికే ఒక పాటను విడుదల చేశారు. శివరాత్రి సందర్భంగా శనివారం రెండో పాటను రిలీజ్ చేశారు.

హర్ష వర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన పాటకు కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్‌‌‌‌‌‌‌‌ రాశాడు. ‘హాలో మై డియర్ బాయ్స్, అండ్ గాళ్స్.. ప్లీజ్ లిజన్ టు మై శాడ్ స్టోరీ’ అంటూ మొదలైన సాంగ్‌‌‌‌‌‌‌‌లో రవితేజ డిఫరెంట్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నాడు. ‘నేను ప్యార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన పాగలే.. లోకల్ బాబా సెహగలే.. నీకు పెళ్లి పీటలే.. నాకేమో బ్రేకప్ పాటలే.. దిల్లు నీకు ఇచ్చానే.. ఫుల్లు నాకే ఇచ్చావే’ అంటూ ఫరియాతో  బ్రేకప్ సాంగ్ పాడుకుంటూ..  మధ్యలో ఏఎన్ఆర్ ఇమిటేషన్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేశాడు రవితేజ. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో స్టైలిష్ కాస్ట్యూమ్స్‌‌‌‌‌‌‌‌తో  కనిపిస్తున్నాడు.