V6 News

తెలంగాణ ఇచ్చి మాట నిలుపుకున్న సోనియమ్మ: ఎమ్మెల్యే శ్రీగణేశ్

తెలంగాణ ఇచ్చి మాట నిలుపుకున్న సోనియమ్మ: ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: ఏఐసీసీ అగ్ర నేత సోనియమ్మ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి, మాట నిలుపుకున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్​ అన్నారు. ఆమె జన్మదిన వేడుకలను మంగళవారం పికెట్ లోని  క్యాంప్​ఆఫీస్​లో ఘనంగా నిర్వహించారు. కేక్​కట్​చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సికింద్రాబాద్​లో కంటెస్టెడ్​ఎమ్మెల్యే, కాంగ్రెస్​ఇన్​చార్జి ఆదం సంతోష్​కుమార్​కేక్​కట్​చేశారు.  

బన్సీలాల్‌‌పేట్ లో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్‌‌, డివిజన్ కమిటీ అధ్యక్షుడు ఐత చిరంజీవి ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. సనత్ నగర్, అమీర్ పేట్, బేగంపేట్, బన్సీలాల్ పేట్, రాంగోపాల్ పేట్ డివిజన్లలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, పార్టీ సనత్ నగర్ నియోజకవర్గ ఇన్​చార్జి డాక్టర్ కోట నీలిమ కేక్​కట్​చేసి, విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్​అందించారు. జీహెచ్​ఎంసీ కార్మికులు దుప్పట్లు, బల్కంపేట ప్రభుత్వ దవాఖానలో పేషెంట్లు పండ్లు పంపిణీ చేశారు.