కరోనా సోకిందని తల్లిని భావి వద్ద వదేలిసిన కొడుకులు

కరోనా సోకిందని తల్లిని భావి వద్ద వదేలిసిన కొడుకులు

వరంగల్ జిల్లా : కంటికి కనపడని కరోనా మహమ్మారీ తల్లి, కొడుకులను విడదీసింది. మానవ సంబంధాలను మట్టి కరిపిస్తోంది. పేగు బంధాన్ని కూడా దూరం చేస్తోంది.తల్లికి కరోనా సోకిందని…నవ మాసాలు మోసి, పెంచి, పెద్ద చేసిన మాతృమూర్తిని వ్యవసాయ భావి వద్దనే వదిలేశారు పుత్రరత్నాలు.  ఆ తల్లి పంట చేనుల్లో దీనంగా కూర్చుంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని హాస్పిటల్ లో  చేర్పించి ట్రీట్ మెంట్ అందించాల్సిన కొడుకులు అమానవీయంగా ప్రవర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి మారబోయిన లచ్చమ్మ అనే 82 ఏళ్ల వృద్ధురాలు. ఈమెకు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఇటీవలే లచ్చమ్మకు కరోనా సోకింది.

అమెను హాస్పిటల్ కి తీసుకుని వెల్లాల్సిన కొడుకులు ఇంట్లో ఉండనీయకుండా బావి దగ్గర చిన్న గుడారం వేసి అందులో వదిలిపెట్టారు. తల్లిని ఆసుపత్రికి తీసుకుని వెలితే…తమకు కూడా కరోనా సోకుతుందనే అనుమానంతో కర్ర సహాయం లేకుండా నడవలేని తల్లిని పంట చేను వద్ద వదిలేశారు కొడుకులు. పంట చేను దగ్గరే ఉంటున్న లచ్చమ్మ ఎండకు ఎండుతూ దీనంగా చూస్తుంది. ఎలాంటి వసతులు లేని పంటచేను దగ్గర వదిలి వెళ్లిన కొడుకుల తీరును గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. కన్న తల్లి అని కూడా చూడకుండా కొడుకులు వ్యవహరించిన తీరు ఒ కవి రాసిన పాట మాయమై పోతున్నాడమ్మా..మనషన్న వాడు అనే పాటను గుర్తు చేస్తుంది.