కరోనా బారిన పడ్డ బాడీ బిల్డర్​కు సోనూ సాయం

కరోనా బారిన పడ్డ బాడీ బిల్డర్​కు సోనూ సాయం
  • కరోనా బారిన పడ్డ బాడీ బిల్డర్​కు యశోదలో మెరుగైన ట్రీట్ మెంట్
  • ఆర్థిక సాయం అందించిన యాక్టర్ సోనూసూద్
  • క్రిటికల్ కండీషన్ నుంచి కోలుకున్న బిల్డర్ సుశీల్ కుమార్

హైదరాబాద్,వెలుగు: కరోనా బారిన పడి, తీవ్ర ఇన్ఫెక్షన్​తో బాధపడుతున్న తెలంగాణ యువ బాడీ బిల్డర్​ సుశీల్​ కుమార్(32)కు యశోద హాస్పిటల్స్ డాక్టర్లు మెరుగైన ట్రీట్ మెంట్ అందించారు. ప్రస్తుతం సుశీల్ కుమార్ క్రిటికల్ కండీషన్ నుంచి కోలుకుంటున్నాడు.  కొన్నిరోజుల క్రితం  సుశీల్ కుమార్ కరోనాతో అత్యంత సీరియస్ ​కండీషన్​లో మలక్ పేట యశోద హాస్పిటల్​లో అడ్మిట్ అయ్యాడు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడి లంగ్స్​ 80 శాతం మేర  డ్యామేజ్ అయ్యాయి.  ఇలాంటి పరిస్థితిలో ఉన్న సుశీల్ కుమార్​కు యశోద హాస్పిటల్​లోని ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ట్రీట్​మెంట్ అందించారు.  ప్రోనింగ్, ప్రారంభ ట్రాకియోస్టోమీ, మార్గదర్శక- ఆధారిత అత్యాధునిక వైద్యంతో పాటు ఇంక్యుబేషన్, మెకానికల్ వెంటిలేషన్​ను అతడి ​కోసం ఏర్పాటు చేశారు. రెండు వారాల్లోనే వెంటిలేటర్ లేకుండా ఊపిరి పీల్చుకునేలా సుశీల్​కుమార్​కు ట్రీట్​మెంట్ చేసినట్లు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు.  సుశీల్ క్రీడా నేపథ్యం తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించేందుకు యాక్టర్ సోనూసూద్ చేసిన సాయం ఎంతో గొప్పదన్నారు. సుశీల్​కుమార్​ బాడీలో వైరస్ లోడ్​ను తీవ్రమైన స్థాయి నుంచి తగ్గించి అతడిని సాధారణ ట్రీట్​మెంట్ దశకు తీసుకొచ్చేందుకు నెలన్నర టైమ్ పట్టిందని యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ తెలిపారు.