పహల్గాం ఘటనపై వ్యాఖ్యలు .. సోనూ నిగమ్​పై కేసు

పహల్గాం ఘటనపై వ్యాఖ్యలు .. సోనూ నిగమ్​పై కేసు

బెంగళూరు: బాలీవుడ్ ఫేమస్ సింగర్ సోనూ నిగమ్ చిక్కుల్లో పడ్డారు. పహల్గాం ఘటనపై వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. బెంగళూరు విర్గోనగర్‌‌ ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగిన కాన్సర్ట్​లో సోనూ నిగమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లోంచి ఒక అభిమాని లేచి కన్నడలో పాట పాడాలని డిమాండ్ చేశారు. పదే పదే కోరడం.. గట్టిగా అరవడంతో సోనూ నిగమ్‌‌ సహనం కోల్పోయారు. పాటలు ఆపేసి కన్నడ ప్రేక్షకుల గురించి మాట్లాడారు. 

కన్నడ భాష అంటే తనకు ఇష్టమేనని.. కానీ ఆ అభిమాని ఆ భాషలోనే పాడాలని బెదిరించడం తనకు నచ్చలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం అటాక్ గురించి ప్రస్తావించారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాం దాడికి ఇలాంటి వ్యాఖ్యలే కారణం. ఇప్పుడు మీరు ఏంచేశారో అలాంటి వాటివల్లే ఆ దాడి జరిగింది. డిమాండ్‌‌ చేసే ముందు మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని ఆయన ఘాటుగా స్పందించారు.