త్వరలో గ్రూప్ 4 కు నోటిఫికేషన్ : మంత్రి హరీష్

త్వరలో గ్రూప్ 4 కు నోటిఫికేషన్ : మంత్రి హరీష్

రాష్ట్రంలో 17 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో  ఉచిత శారీరక దృఢత్వ శిక్షణను పొందుతున్న పోలీస్, కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు పాలు, పండ్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు.. కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ లో 1030 మందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. జిల్లాలో 580 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో 17 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. 

త్వరలో మరో 2000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని హరీష్ రావు అన్నారు. త్వరలో గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ వెల్లడిస్తామని స్పష్టం చేశారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో  అగ్నిపత్ పథకంతో 4 ఏళ్ళ కాంట్రాక్ట్ తో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని తెలిపారు. 4 ఏళ్ల  కాంట్రాక్ట్ తో నింపే ఆర్మీ  ఉద్యోగాలకు యువత సుముఖ చూపడం లేదని ఆరోపించారు.