జాతీయ సదస్సుకు  అంగడిరైచూర్ సర్పంచ్

జాతీయ సదస్సుకు  అంగడిరైచూర్ సర్పంచ్

కొడంగల్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించిన మహిళా ప్రజాప్రతినిధుల సదస్సులో కొడంగల్​మండలం అంగడిరైచూర్ సర్పంచ్ సౌభాగ్యలక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 16 మంది సర్పంచులలో ఈమెకు చోటు దక్కడం విశేషం.

మహిళా పంచాయతీ ప్రతినిధులను బలోపేతం చేయడం, వారిలో నాయకత్వ లక్షణాలు పెంచడం, పాలనలో పురుషుల ఆధిపత్యాన్ని అరికట్టడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలని ఢిల్లీ వెళ్లిన కొడంగల్ ఎంపీడీవో ఉషశ్రీ వివరించారు.