
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. గురువారం బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాతో సమావేశమయ్యారు. సెలెక్షన్ కమిటీ సమావేశం తర్వాత ఇది చోటు చేసుకుంది. ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ కు సంబంధించిన రోడ్ మ్యాప్ పై చర్చిం చినట్లు సమాచారం. అలాగే మాజీ సారథి ధోనీ భవితవ్యం చర్చకు వచ్చినా…ఏం మాట్లాడారనే అంశాలను ఎవరూ బహిర్గతం చేయడం లేదు. చీఫ్ కోచ్ రవిశాస్ర్తి ఈ సమావేశానికి దూరంగా ఉన్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగే టెస్ట్ మ్యాచ్ లో దాదా , శాస్త్రి మాట్లాడుకునే అవకాశం ఉందని తెలుస్తోం ది.\