Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ (BCCI) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సెక్యూరిటీ విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకుంది. గంగూలీకి ఇస్తున్న భారీ భద్రతను (Security Cover) తగ్గిస్తూ రాష్ట్ర సెక్యూరిటీ వింగ్ నిర్ణయం తీసుకుంది. 2023లో గంగూలీకి ఉన్న Y కేటగిరీ సెక్యూరిటీని Z కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, తాజా రివ్యూ తర్వాత దాన్ని మళ్లీ పాత కేటగిరీకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ సెక్యూరిటీ కేటగిరీల డిఫరెన్స్?:
Z కేటగిరీ: ఈ అరేంజ్‌మెంట్‌లో గంగూలీకి దాదాపు 8 నుంచి 10 మంది పోలీస్ సిబ్బంది సెక్యూరిటీగా ఉండేవారు. బెహలాలో ఉన్న అతని ఇంటి దగ్గర స్పెషల్ గార్డ్స్, అతను ఎక్కడికి ట్రావెల్ చేసినా వెంటే ఉండే ఆర్మ్‌డ్ ఎస్కార్ట్ ఉండేవాళ్లు.. ఇప్పుడు ఈ వీఐపీ ప్రొటెక్షన్‌ను రోల్‌బ్యాక్ చేసేశారు.
Y కేటగిరీ: ఈ కొత్త రూల్ ప్రకారం గంగూలీ పర్సనల్ సెక్యూరిటీలో స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ముగ్గురు పోలీసులు మాత్రమే ఉంటారు. అలాగే అతని ఇంటి దగ్గర భద్రత కోసం మరో ముగ్గురు పోలీసులు డ్యూటీలో ఉంటారు.
గంగూలీ సెక్యూరిటీని ఎందుకు తగ్గించారంటే?:
గంగూలీకి సెక్యూరిటీ తగ్గించడానికి గల కారణాలను ప్రభుత్వ అధికారులు క్లారిఫై చేశారు. లేటెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ ప్రకారం.. ప్రస్తుతానికి గంగూలీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని తేలింది. అందువల్ల అతనికి Z కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదని బెంగాల్ లోని బీజేపీ ప్రభుత్వం డిసైడ్ అయింది.
యాక్టివ్ రోల్స్ కే ఇంపార్టెన్స్: ప్రస్తుత రూల్స్ ప్రకారం.. ఒక వ్యక్తి హోదా, వారు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ పదవులు, అఫీషియల్ స్టేటస్‌ను బట్టి మాత్రమే భద్రతను కేటాయిస్తారు. ప్రస్తుతం గంగూలీ ఎలాంటి అధికారిక పదవుల్లో లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పాలి.. ఇది కేవలం గంగూలీ ఒక్కరి కోసమే తీసుకున్న నిర్ణయం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా VIP సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను సర్కార్ రీస్ట్రక్చర్ చేస్తోంది.
