2026 టీ20 వరల్డ్ కప్ కు నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నీ ఇండియాలోనే జరుగుతుండడంతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టైటిల్ నిలబెట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జట్టు అత్యంత పటిష్టంగా ఉండడంతో పాటు గత రెండేళ్లలో తిరుగులేని విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడంతో ఇండియాపై అంచనాలు పెరిగిపోయాయి.
భారత జట్టు విజయవకాశాలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడాడు. వరల్డ్ కప్ లో ఇండియాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ.. "సొంతగడ్డపై వరల్డ్ కప్ జరగడం కంటే పెద్ద విషయం మరొకటి ఉండదు. భారత జట్టు ఎప్పుడూ నాకు ఫేవరేట్ జట్టు. ఇండియాకు బలమైన స్పిన్ ఎటాక్ ఉంది. వరుణ్ చక్రవర్తి ఫిట్ గా ఉంటే అతను టీమిండియా తరపున ప్రత్యర్థికి ప్రమాదంగా మారతాడు. భారత జట్టులో వరుణ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్". అని గంగూలీ తెలిపాడు. వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.
నెంబర్ వన్ టీ20 స్పిన్నర్ గా వరుణ్:
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో తన నెంబర్ వన్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ర్యాంకింగ్స్ లో 818 రేటింగ్ పాయింట్స్ తో ఎవరికీ అందనంత దూరంలో నిలిచాడు. రెండో ర్యాంక్ లో ఉన్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ 699 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. డఫీకి వరుణ్ చక్రవర్తికి మధ్య ఏకంగా 119 రేటింగ్ పాయింట్స్ ఉండడంతో వరుణ్ చక్రవర్తి నెంబర్ ర్యాంక్ మరికొన్ని నెలలపాటు సేఫ్ గా ఉండడం ఖాయంగా మారింది. వరల్డ్ కప్ లో నెంబర్ బౌలర్ గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగనున్నాడు.
►ALSO READ | IND vs NZ: టీమిండియాకు తమిళనాడు స్పిన్నర్ సవాల్.. ఎవరీ ఆదిత్య అశోక్..?
