న్యూజిలాండ్‌‌తో రెండో టెస్ట్‌‌లో సౌతాఫ్రికా 220/6

న్యూజిలాండ్‌‌తో రెండో టెస్ట్‌‌లో సౌతాఫ్రికా 220/6

హామిల్టన్‌‌: న్యూజిలాండ్‌‌తో మంగళవారం మొదలైన రెండో టెస్ట్‌‌లో సౌతాఫ్రికా తడబడి తేరుకుంది. చివర్లో రువాన్‌‌ డి స్వార్డ్‌‌ (55 బ్యాటింగ్‌‌), వాన్‌‌ బెర్గ్‌‌ (34 నాటౌట్‌‌) నిలకడగా ఆడటంతో తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌కు ప్రొటీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 89 ఓవర్లలో 220/6 స్కోరు చేసింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన సౌతాఫ్రికాను ఆరంభంలో కివీస్‌‌ బౌలర్లు కట్టడి చేశారు.

కెప్టెన్‌‌ నీల్‌‌ బ్రాండ్‌‌ (25), వాన్‌‌ టొండెర్‌‌ (32), జుబేర్‌‌ హమ్జా (20), బెడింగ్‌‌హామ్‌‌ (39) రాణించినా.. క్లైడ్‌‌ ఫోర్టుయిన్‌‌ (0), కీగన్‌‌ పీటర్సన్‌‌ (2) నిరాశపర్చారు. చివర్లో స్వార్డ్‌‌, బెర్గ్‌‌ ఏడో వికెట్‌‌కు అజేయంగా 70 రన్స్‌‌ జత చేసి మరో వికెట్‌‌ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు. రచిన్‌‌ రవీంద్ర 3 వికెట్లు తీశాడు.