స్టబ్స్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌ లేకుండానే.. టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు సౌతాఫ్రికా టీమ్‌ ఎంపిక

స్టబ్స్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌ లేకుండానే.. టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు సౌతాఫ్రికా టీమ్‌ ఎంపిక

జోహన్నెస్‌‌‌‌బర్గ్: సౌతాఫ్రికా సెలెక్టర్లు తమ టీమ్ డ్యాషింగ్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్‌‌‌‌, ర్యాన్ రికెల్టన్‌‌‌‌కు షాకిచ్చారు.  ఇండియా, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 వరల్డ్‌‌‌‌ కప్ టీమ్‌‌‌‌లో ఈ ఇద్దరినీ పక్కనబెట్టారు. ఈ మేరకు ఐడెన్‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ కెప్టెన్సీలో 15 మంది కూడిన జట్టును శుక్రవారం ప్రకటించారు. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టు నుంచి  ఏడుగురు ఆటగాళ్లను మాత్రమే ప్రస్తుత జట్టులో కొనసాగించారు. 

క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, అన్రిచ్ నార్జ్‌‌‌‌,  మార్కో యాన్సెన్ వంటి సీనియర్లు తమ స్థానాలను నిలుపుకున్నారు. డెవాల్డ్ బ్రెవిస్, క్వెనా మఫాకా, కార్బిన్ బాష్, టోనీ డి జార్జి, జేసన్ స్మిత్, డోనోవన్ ఫెరీరాలకు తొలిసారి వరల్డ్ కప్ పిలుపు అందింది. 

గ్రూప్‌‌‌‌–డిలో ఉన్న సఫారీ టీమ్ ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌‌‌‌లో కెనడాతో తొలి మ్యాచ్ ఆడనుంది. సౌతాఫ్రికా టీమ్: ఐడెన్ మార్‌‌‌‌క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (కీపర్), డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, అన్రిచ్ నార్జ్, కేశవ్ మహారాజ్, మార్కో యాన్సెన్, డెవాల్డ్ బ్రెవిస్, క్వెనా మఫాకా, కార్బిన్ బాష్, టోనీ డిజార్జి, జేసన్ స్మిత్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, లుంగి ఎంగిడి.