రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం.. హెండ్రిక్స్‌‌‌‌ ధమాకా

రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం.. హెండ్రిక్స్‌‌‌‌ ధమాకా
  •     5 వికెట్ల తేడాతో ఓడిన ఇండియా
  •     రింకూ సింగ్‌‌‌‌, సూర్య శ్రమ వృథా

గెబెహా: సౌతాఫ్రికా టూర్‌‌‌‌ను ఇండియా ఓటమితో ఆరంభించింది. బ్యాటర్లు మెరిసినా..బౌలర్లు ఫెయిల్‌‌‌‌ కావడంతో మంగళవారం జరిగిన రెండో టీ20లో ఇండియా 5 వికెట్ల తేడాతో (డక్‌‌‌‌వర్త్‌‌‌‌ లూయిస్‌‌‌‌) సఫారీ టీమ్‌‌‌‌ చేతిలో ఓడింది. టాస్‌‌‌‌ ఓడిన ఇండియా 19.3 ఓవర్లలో 180/7 స్కోరు చేసింది. రింకూ సింగ్‌‌‌‌ (39 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 68 నాటౌట్‌‌‌‌), సూర్యకుమార్‌‌‌‌ (36 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 56), తిలక్‌‌‌‌ వర్మ (29) రాణించారు. మ్యాచ్‌‌‌‌ మధ్యలో వర్షం రావడంతో సౌతాఫ్రికా టార్గెట్‌‌‌‌ను 15 ఓవర్లలో 152 రన్స్‌‌‌‌గా రివైజ్‌‌‌‌ చేశారు.

దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీలు 13.5 ఓవర్లలో 154/5  స్కోరు చేసి నెగ్గారు. రీజా హెండ్రిక్స్‌‌‌‌ (27 బాల్స్ 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 49), కెప్టెన్‌‌‌‌ ఐడెన్‌‌‌‌ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (30) మెరుపులు మెరిపించారు. ఓపెనర్‌‌‌‌గా వచ్చిన మాథ్యూ బ్రీట్జ్‌‌‌‌కే (16), హెండ్రిక్స్‌‌‌‌ తొలి బాల్‌‌‌‌ నుంచే ఫోర్లతో విరుచుకుపడ్డారు. అయితే ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 42 రన్స్‌‌‌‌ జోడించి థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో బ్రీట్జ్‌‌‌‌కే రనౌటైనా, మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ ఉన్నంతసేపు హడలెత్తించాడు.

హెండ్రిక్స్‌‌‌‌తో రెండో వికెట్‌‌‌‌కు 54 రన్స్‌‌‌‌ జోడించి ఔటయ్యాడు. కొద్దిసేపటికే మూడు బాల్స్‌‌‌‌ తేడాలో హెండ్రిక్స్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌ (7) వెనుదిరిగినా, మిల్లర్‌‌‌‌ (17), స్టబ్స్‌‌‌‌ (14 నాటౌట్‌‌‌‌), ఫెలుక్వాయో (10 నాటౌట్‌‌‌‌) ఈజీగా గెలిపించారు. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ షంసీ (1/18)కి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. గురువారం మూడో టీ20 జరగనుంది.

రింకూ జోరు..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు సరైన ఆరంభాన్నివ్వలేదు. ఇన్నింగ్స్‌‌‌‌ థర్డ్‌‌‌‌ బాల్‌‌‌‌కు యశస్వి జైస్వాల్‌‌‌‌ (0), రెండో ఓవర్‌‌‌‌లో ఆఖరి బాల్‌‌‌‌కు శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (0) ఔటయ్యారు. 6/2 స్కోరు వద్ద వచ్చిన తిలక్‌‌‌‌ వర్మ, సూర్య చెలరేగారు. థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో తిలక్‌‌‌‌ 6, 4, 4, 5 నోబాల్స్‌‌‌‌తో 19 రన్స్‌‌‌‌ దంచితే, తర్వాతి ఓవర్‌‌‌‌లో సూర్య 4, 6, 4తో 15 రన్స్‌‌‌‌ రాబట్టాడు. ఐదో ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌ కొట్టిన తిలక్‌‌‌‌ను తర్వాతి ఓవర్‌‌‌‌లో కోయెట్జీ (3/32) దెబ్బకొట్టాడు. దీంతో మూడో వికెట్‌‌‌‌కు 49 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 59/3 స్కోరు చేసింది.

ఫోర్‌‌‌‌తో ఖాతా తెరిచిన రింకూ సింగ్‌‌‌‌ చివరి వరకు క్రీజులో ఉండి భారీ స్కోరు అందించాడు. సూర్య కూడా స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేయడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 25 రన్స్‌‌‌‌ వచ్చాయి. ఫలితంగా ఇండియా 84/3తో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌ను ముగించింది. 11వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో సూర్య 29 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇదే ఓవర్‌‌‌‌లో రింకూ వరుసగా 4, 4 బాదడంతో 17 రన్స్‌‌‌‌ వచ్చాయి.

13వ ఓవర్‌‌‌‌లో రింకూ మూడు ఫోర్లతో 15 రన్స్‌‌‌‌ రాబడితే, 14వ ఓవర్‌‌‌‌లో సూర్యను ఔట్‌‌‌‌ చేసి ప్రొటీస్‌‌‌‌ షాకిచ్చారు. నాలుగో వికెట్‌‌‌‌కు 70 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. జితేశ్‌‌‌‌ శర్మ (1) నిరాశపర్చినా, 15వ ఓవర్‌‌‌‌లో రింకూ మళ్లీ మూడు ఫోర్లతో జోరు తగ్గనీయలేదు. జడేజా (19) ఫోర్‌‌‌‌, సిక్స్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి రాగా, 19వ ఓవర్‌‌‌‌ లాస్ట్‌‌‌‌ రెండు బాల్స్‌‌‌‌ను రింకూ రెండు సిక్సర్లుగా మలిచాడు. ఆఖరి ఓవర్‌‌‌‌లో రెండు, మూడో బాల్స్‌‌‌‌కు జడేజా, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (0) ఔటయ్యారు. రింకూ.. జడ్డూతో ఆరో వికెట్‌‌‌‌కు 38 రన్స్‌‌‌‌ జోడించాడు. తర్వాత వర్షం రావడంతో ఇన్నింగ్స్‌‌‌‌ను ఆపేశారు. 

సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 19.3 ఓవర్లలో 180/7 (రింకూ 68*, సూర్య 56, కోయెట్జీ 3/32), సౌతాఫ్రికా (టార్గెట్ 152): 13.5 ఓవర్లలో 154/5 (హెండ్రిక్స్‌‌‌‌ 49,  ముకేశ్‌‌‌‌ 2/34).