2024 Biggest South Movies: 2024లో సౌత్ సినిమాలదే హవా.. వేలకోట్ల బిజినెస్

2024 Biggest South Movies: 2024లో సౌత్ సినిమాలదే హవా.. వేలకోట్ల బిజినెస్

ఒకప్పుడు ఇండియన్ సినిమాలంటే బాలీవుడ్ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారు. కానీ, బాహుబలి సినిమా తరువాత దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల హవా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఆ తరువాత వచ్చిన చాలా సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను సైతం షేక్ చేశాయి. వాటిలో పుష్ప, కాంతార, కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్  ఆ క్రేజ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచ్చింది. 

ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సౌత్ సినిమాలు కూడా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ లైనప్ చేస్తుంటే.. 2024లో ఇండియన్ బాక్సాఫీస్ మీద సౌత్ సినిమాల డామినేషన్ ఉండనుందని క్లియర్ గా అర్థమవుతోంది. అలాంటి ఐదు సినిమాకు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి సౌత్ స్టామినాను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? స్టార్ క్యాస్ట్ వివరాలు ఇప్పుడు మీ కోసం. 
 
కల్కి 2898 AD: 
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకే ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

పుష్ప 2:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాపై కూడా ఇండియన్ లెవల్లో భారీ అంచాలున్నాయి. కారణం.. పుష్ప పార్టీ 1 భారీ విజయాన్ని సాధించడమే. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాపై ఆడియన్స్ లో క్రేజ్ ఎలా ఉందంటే.. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్సే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా జరుగుతోందని సమాచారం. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు ఈ సినిమా కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో. 

దేవర పార్ట్ 1:
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా దేవర. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూరు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.  సముద్రం బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్ల రేంజ్ లో ఎఫెక్ట్ చూపిస్తుందని అంచనా. 

గేమ్ ఛేంజర్:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. పొలిటికల్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో ఎఫెక్ట్ చూపిస్తోంది. కారణం.. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం.. అది కూడా శంకర్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాపై కూడా రూ.1000 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. 

కంగువ:
తమిళ స్టార్ సూర్య హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 12 భాషల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకుకే తగ్గట్టుగానే విజువల్స్ కూడా ఉండటంతో ఈ సినిమా కూడా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. 

ఇలా 2024లో ఇండియన్ బాక్సాఫీస్ పైన సౌత్ సినిమాల దండయాత్ర కొనసాగనుంది. మరి మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్టులుగా వస్తున్న ఈ సినిమాలు సౌత్ సినిమాల ఖ్యాతిని ఏ రేంజ్ లో నిలబెడతయో చూడాలి.