రైల్వే పార్శిల్ యాప్ ప్రారంభం : దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

రైల్వే పార్శిల్ యాప్ ప్రారంభం : దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
  •     ఆవిష్కరించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

హైదరాబాద్, వెలుగు: గూడ్స్ రవాణా, పార్శిల్ సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సరికొత్త యాప్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. బుధవారం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని రైల్ నిలయంలో జరిగిన రైల్ పార్శిల్ లాజిస్టిక్స్ సమావేశంలో ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ యాప్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  

రైల్వే పార్శిల్ వ్యాపారంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్శిల్‌‌‌‌‌‌‌‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఇంటి దగ్గరే పార్శిల్ పికప్ చేసుకుని, గమ్యస్థానంలో డెలివరీ చేసేలా ఈ సేవలు ఉంటాయని పేర్కొన్నారు.