సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయి

సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయి

సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేసిందని సీపీఆర్ఓ రాకేశ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 50 రోజులు మిగిలి ఉండగానే దక్షిణ మధ్య రైల్వే 10 వేల కోట్ల మార్క్ దాటిందని వివరించారు. ప్రతి సంవత్సరం కంటే ఈసారి 20 శాతం వృద్ధి పెరిగినట్లు తెలిపారు. కోల్, సిమెంట్, పుడ్, ఎరువులు లాంటి ట్రాన్స్ పోర్ట్ లో అధికంగా లాభాలు సాధించినట్లు సీపీఆర్ఓ రాకేశ్ వివరించారు.