V6 News

ఒక్కటైన సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్

ఒక్కటైన సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.  దక్షిణ భారత సినిమా నిర్మాతలంతా ఏకమై ఆదివారం హైదరాబాద్‌‌ లో సమావేశమయ్యారు. ఇందులో  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నిర్మాతల సంఘాలు కలిసి సినిమా రంగాన్ని రక్షించేందుకు ఒకటయ్యాయి.

పరిశ్రమపై ప్రభావం చూపే నిర్ణయాలు (థియేటర్ టర్మ్స్, 8 వారాల ఓటీటీ విండో) ఏకపక్షంగా తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించాయి. నిర్మాతల ప్రయోజనాల కోసం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (సిప్ఫా)ను ఏర్పాటు చేశారు. 

నాలుగు భాషల పరిశ్రమలకు చెందిన సభ్యులతో ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. సినీ పరిశ్రమలోని  కీలక నిర్ణయాల్లో 
నిర్మాతల పాత్రను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.