
చాలామంది ఇండిపెండెంట్ హౌస్ కు ప్రాధాన్యత ఇస్తారు. గదులు విశాలంగా ఉంటాయి..మన ఇష్టం వచ్చిన విధంగా ఉండవచ్చు.. అదే అపార్ట్ మెంట్ లో అయితే కొన్ని రిస్టిక్షన్స్ ఉంటాయి కదా.. అందుకే ఇండిపెండెంట్ గా ఉండాలనుకొనే వారు కట్టిన ఇల్లును కొనుక్కోవడమో.. లేదా స్థలాన్ని కొనుగోలు అందులో కట్టుకోవడమో చేస్తారు. ఇలాంటప్పుడు చుట్టు పక్కల ఇళ్ల వాస్తు సరిగా లేకపోతే ఆ ప్రభావం మన ఇంటిపై ఎలా ఉంటుంది.. మన ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నా.. మన పక్కన ఉన్న ఇల్లు వాస్తు ప్రకారం లేకపోతే మనకేమైన సమస్యలు వస్తాయా.. ఈ విషయంలో వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్ గారి సలహాలను ఒకసారి చూద్దాం. . .
ప్రశ్న: ఇంటికి దక్షిణంలో ఉన్న ఇంటి వాళ్ల వాటర్ సంప్.. మా ఇంటికి ఆగ్నేయంలో ఉంది. వాళ్లు ఈ మధ్యే ఇల్లు కట్టారు. ఆ ఇల్లు కట్టినప్పటినుంచి మాకు చాలా సమస్యలు వస్తున్నాయి. పక్కింటి వాస్తు వల్ల కూడా మా మీద ప్రభావం ఉంటుందా?
జవాబు: పక్కింటికి వాస్తు సరిగా లేకపోవడం వల్ల మీ ఇంటి మీద ఎలాంటి ప్రభావం ఉండదు. కాకపోతే.. పక్కింటికి కాంపౌండ్ వాల్ లేకపోతే మాత్రం కచ్చితంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి మీ పక్కింటి వాళ్లకు కాంపౌండ్ వాల్ లేకపోతే కట్టించుకొమ్మని చెప్పండి.