V6 News

రాజేంద్రనగర్‌‌లోని డిసెంబర్ 11 నుంచి ‘బ్యాండ్’ సౌత్ జోన్ పోటీలు

రాజేంద్రనగర్‌‌లోని డిసెంబర్ 11 నుంచి ‘బ్యాండ్’ సౌత్ జోన్ పోటీలు
  •     గెలిచినోళ్లు నేరుగా ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌కు సెలెక్ట్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో గురువారం నుంచి మూడు రోజుల పాటు ‘సదరన్ జోనల్ బ్యాండ్ కాంపిటీషన్స్’ జరగనున్నాయి. రాజేంద్రనగర్‌‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.  2026 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని స్కూల్ పిల్లల్లో దేశభక్తిని నింపేందుకు ఈ పోటీలు పెడుతున్నారు. 

తెలంగాణ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరుగుతున్న  పోటీల్లో ఆతిథ్య తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి మొత్తం 25 టీమ్స్ పాల్గొంటున్నాయి.  ఈ జోనల్ కాంపిటీషన్స్‌లో గెలిచిన టీమ్.. నేషనల్ లెవల్‌లో సౌత్ జోన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది.