దివ్యాంగుల సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

దివ్యాంగుల సౌత్ జోన్  క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

మల్కాజ్‌‌‌‌గిరి, వెలుగు : దివ్యాంగ క్రికెటర్ల నైపుణ్యాలు అపారంగా ఉంటాయని, వారు ప్రదర్శిస్తున్న ధైర్యం అమోఘమని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ) వర్క్స్ కమిటీ ఛైర్మన్ డి. శ్రీధర్ అన్నారు. దివ్యాంగుల సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌‌‌‌ను ఆయన శుక్రవారం ఈసీఐఎల్‌‌‌‌లోని కొండల్‌‌‌‌రావు స్టేడియంలో ప్రారంభించారు. 

దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో దివ్యాంగ క్రికెటర్లు పాల్గొన్నారు.  శ్రీధర్ మాట్లాడుతూ దివ్యాంగులు  ఎవరికంటే తక్కువ కాదని ధైర్యం నింపారు. ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. డీసీసీఐ సౌత్ జోన్ చైర్మ్న్​ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ దివ్యాంగులు అందరిలా అన్నీ చేయగలరని, వారి క్రీడా సామర్థ్యాలను వెలికితీసేందుకే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.