జూనియర్ హాకీ జట్టు కోచ్గా సోయెజ్‌‌‌‌‌‌‌‌

జూనియర్ హాకీ జట్టు కోచ్గా సోయెజ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా జూనియర్‌‌‌‌‌‌‌‌ హాకీ జట్టు కొత్త కోచ్‌‌‌‌‌‌‌‌గా ఫ్రెడరిక్‌‌‌‌‌‌‌‌ సోయెజ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) నియమితులయ్యాడు. ఇప్పటి వరకు ఈ బాధ్యతల్లో కొనసాగిన ఇండియా మాజీ గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌, ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ పతక విజేత పి. ఆర్‌‌‌‌‌‌‌‌. శ్రీజేష్‌‌‌‌‌‌‌‌ స్థానంలో సోయెజ్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. శ్రీజేష్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ముగియడంతో కొత్త కోచ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేశామని హాకీ ఇండియా స్పష్టం చేసింది. 2036 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ ఆతిథ్య లక్ష్యంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఈ మార్పు చేసినట్లు వెల్లడించింది. 

ఇక సోయెజ్‌‌‌‌‌‌‌‌కు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో అపారమైన అనుభవం ఉంది. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ తరఫున 196 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 195 గోల్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. కోచ్‌‌‌‌‌‌‌‌గా స్పెయిన్‌‌‌‌‌‌‌‌, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ జట్లను మూడు ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ (రియో, టోక్యో, పారిస్‌‌‌‌‌‌‌‌)లో ముందుండి నడిపించాడు. యంగ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను తీర్చిదిద్దడంలో సోయెజ్‌‌‌‌‌‌‌‌కు మంచి పేరు ఉంది. 

ఇండియా హాకీలో కొత్త ఒరవడిని తీసుకొచ్చేందుకు సోయెజ్‌‌‌‌‌‌‌‌ను నియమించామని హాకీ ఇండియా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ దిలీప్‌‌‌‌‌‌‌‌ టిర్కీ ఆశాభావం వ్యక్తం చేశాడు. పెనాల్టీ కార్నర్‌‌‌‌‌‌‌‌ వ్యూహాల్లో సోయెజ్‌‌‌‌‌‌‌‌ నైపుణ్యం ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు అతిపెద్ద బలంగా మారనుంది.