అడ్డాకులలో పోలీస్ స్టేషన్​ను తనిఖీ చేసిన ఎస్పీ

అడ్డాకులలో పోలీస్ స్టేషన్​ను తనిఖీ చేసిన ఎస్పీ

అడ్డాకుల, వెలుగు: స్థానిక పోలీస్ స్టేషన్ ను సోమవారం ఎస్పీ హర్షవర్ధన్  తనిఖీ చేశారు. అంతకుముందు రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా శాఖాపూర్  శివారులో టోల్ ప్లాజా నిర్వాహకులు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్​ రికార్డులను పరిశీలించారు.

ట్రైనీ ఎస్పీ చిత్తరంజన్ దాస్, భూత్పూర్  సీఐ రామకృష్ణ, మూసాపేట, అడ్డాకులు ఎస్ఐలు సుజాత, శ్రీనివాస్  ఉన్నారు.