- కాల్చి చంపిన దుండగులు
పొలం విషయంలో గొడవే కారణం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ పంబాల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ లీడర్, ఆయన కొడుకును దుండగులు మంగళవారం హత్య చేశారు. పొల్లం దగ్గర ఇద్దరు వ్యక్తులు వారితో గొడవపడి తుపాకులతో కాల్చి చంపినట్లు వీడియోలో రికార్డు అయింది. సమాజ్‌వాదీ పార్టీ లీడర్ దివాకర్ భార్య షమ్‌సోయి గ్రామానికి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఊరిలో పొలాల గుండా రోడ్లు వేస్తుండగా దివాకర్‌కు సంబంధించి పొలంలో కొంత స్థలం రోడ్డు కిందకు పోయింది. ఆ విషయమై మాట్లాడేందుకు వెళ్లిన దివాకర్, ఆయన కొడుకుతో ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు. వాళ్లను బూతులు తిట్టి రచ్చ చేశారు. ఒక్కసారిగా వాళ్ల దగ్గర ఉన్న తుపాలకును తీసి గోలీమార్ అని కేకలు వేస్తూ ఇద్దర్ని కాల్చడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. దుండగులు ఇద్దరు పారారీలో ఉన్నారని, వారిలో ఒకరిని గుర్తించామని పోలీస్ ఆఫీసర్ యమునా ప్రసాద్ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
