లొంగిపోయి ప్రశాంత జీవితం గడపండి: మావోయిస్టులకు ఎస్పీ శబరీశ్ పిలుపు

లొంగిపోయి ప్రశాంత జీవితం గడపండి: మావోయిస్టులకు ఎస్పీ శబరీశ్ పిలుపు

ములుగు, వెలుగు: మావోయిస్టులు లొంగిపోయి కుటుంబాలతో ప్రశాంత జీవితం గడపాలని, అందుకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ములుగు జిల్లా ఎస్పీ పి.శబరీశ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో మావోయిస్టు పార్టీ సభ్యులు ముగ్గురు లొంగిపోగా.. తక్షణ సాయంగా రూ.25వేల చొప్పున రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మావోయిస్టులు ప్రజాస్వామ్యయుతంగా సమాజంలో అంతర్భాగం కావాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తుందని పేర్కొన్నారు.

చత్తీస్​గఢ్‎లోని బీజాపూర్​జిల్లా కోమటిపల్లికి చెందిన ఏసీఎం సభ్యుడు మడవి మంగ్లీకి రూ.3.75లక్షలు, కౌర్గట్ట గ్రామానికి చెందిన మడకం కమలేశ్, బుస్సాపూర్​కు చెందిన మడకం భీమేలకు రూ.75వేల చొప్పున వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్​చార్జి ఓఎస్డీ, ములుగు డీఎస్పీ ఎన్​.రవీందర్​, ఆర్ఐ తిరుపతి, సిబ్బంది ఉన్నారు.