
ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) అసిస్టెంట్ (రాజ్యభాష) పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 02.
పోస్టుల సంఖ్య: 08 అసిస్టెంట్(రాజ్యభాష)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. హిందీ టైప్ రైటింగ్ వేగం 25 డబ్ల్యూ.పి.ఎం., . కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పరిజ్ఞానం, ఇంగ్లిష్ టైప్ రైటింగ్‌లో నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 18 ఏండ్ల నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 12.
లాస్ట్ డేట్: అక్టోబర్ 02.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులందరికి రూ.500. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400 తిరిగి చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.sac.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.