
హిందీ సినిమా ‘లపతా లేడీస్’లో తనదైన నటనతో ఆకట్టుకున్న స్పర్ష్ శ్రీవాస్తవ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో తను కీలకపాత్ర పోషించబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో తన క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. మిస్ట్రీరియస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.